![]() |
![]() |

ఫామిలీ స్టార్స్ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో పగలబడి నవ్వుకునేలా ఉన్నాయి పంచులు. సుధీర్ ని ఒక రేంజ్ లో ఆదుకున్నారు. అంతే కాదు సుధీర్ ని మహేష్ ఆచంట పొగిడేసాడు కూడా. ఇంతకు ఎలా ఆదుకున్నాడు. సుధీర్ ఎందుకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఆ పంచులేంటో చూద్దాం...
"నేను కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ కథ రాసాను " అని మహేష్ అనేసరికి "మరి ఎందుకు ఇవ్వలేదు " అన్నాడు సుధీర్. "అంటే కొంచెం బాగొచ్చింది. " అన్నాడు మహేష్. "క్యారెట్ బాగా తిను కళ్ళు బాగా కనిపిస్తాయి " అంది అష్షు రెడ్డి. "నైట్ టైం కూడా బాగా కనపడాలంటే "అంటూ తింగరి ప్రశ్న వేసాడు సుధీర్. ఇంతలో దొరబాబు అల్లు అర్జున్ పేరుతో ఉన్న లోగో టీ షర్ట్ వేసుకొచ్చి సుధీర్ కాళ్ళమీద పడి "సీనియర్ వి ఆశీర్వాదం ఇవ్వు "అన్నాడు . "లేడీస్ హాస్టల్ దగ్గరకు షిఫ్ట్ అయ్యావా" అడిగాడు సుధీర్. "నేను వెళ్లాకే అక్కడ లేడీస్ హాస్టల్ వచ్చింది " అన్నాడు దొరబాబు. "నువ్వు కూడా అక్కడికి రావొచ్చుగా ఉమెన్స్ కాలేజీ చేద్దాం " అంటూ అడిగాడు సుధీర్ ని.
ఇంతలో సౌమ్య వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుంటూ సుధీర్ మీదే పంచులు వేసేసింది. సుధీర్ ఒక వైపుకు, అష్షు మరో వైపు సోమ్య పక్కన నిలబడ్డారు. ఇంతలో ఎవరో నెటిజన్ కామెంట్ చేసినట్టు అది సౌమ్య చదివింది. "సుధీర్ పక్కన నిలబడకండి. చాలా అందంగా ఉన్నారు. మింగేస్తాడు." అనేసరికి అందరూ నవ్వేశారు. ఇంతలో హిమజ భూతద్దం తీసుకుని వచ్చింది. ఇక సుధీర్ ఆనందం మాములుగా లేదు. "ఇన్నాళ్లకు నాతో పాటు మ్యాజిక్ చేయడానికి ఒక లేడీ మెజీషియన్ ని పంపించారు " అన్నాడు. వెంటనే హిమజకు కోపం వచ్చింది. "ఓయ్ నేను లేడీ డిటెక్టీవ్ ని" అంది. " మీరు సాల్వ్ చేసిన టిపికల్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అని సుధీర్ అడిగాడు. "వెంకటరావు గారి కుక్కపిల్ల తప్పిపోతే నేనే వెతికి వాళ్లకు ఇచ్చాను " అని చెప్పింది. వెంటనే అష్షు రియాక్ట్ అయ్యింది. "నువ్వే ఎత్తుకెళ్ళిపోయి ఉంటావ్ " అనేసింది. ఆ మాటకు హిమజకు మండిపోయింది.
![]() |
![]() |